రూ. ల‌క్ష జీతంతో.. ఎన్‌ఐఎంఆర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టులు

img

ICMR-NIMR Recruitment 2023 | టెక్నికల్‌ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్‌ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్ (ఎన్‌ఐఎంఆర్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ, బీటెక్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 79

పోస్టులు : టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌.

అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ, బీటెక్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు: 25 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.

జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.112400

ఎంపిక : షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు : ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.300.

చివరి తేది: జూలై 21

వెబ్‌సైట్ : nimr.org.in