General Studies - BIOLOGY Groups Special

img

సరీసృపాలు.. పాలిచ్చే మగ జీవులు

క్షీరదాలు

అధిక ఉష్ణోగ్రతను స్థిరంగా నియంత్రించడం క్షీరదాల లక్షణం. బాహ్యంగా రోమాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేక లక్షణం. రోమాలు, క్షీరగ్రంథులు, స్వేద గ్రంథులు, చర్మావస గ్రంథులు క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి. సీనోజాయిక్‌ యుగాన్ని క్షీరదాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు.

సజీవ క్షీరదాలను మూడు ప్రధానమైన క్రమాలుగా గుర్తించారు. అవి మోనోట్రిమ్‌లు, మార్సుపియల్‌లు, యూథీరియన్లు.

నీలి తిమింగలం (బెలనోప్టిరా మస్కులస్‌)- అతిపెద్ద క్షీరదం

పిగ్మీ ఘ్రా- అతిచిన్న క్షీరదం క్షీరదాల సాధారణ లక్షణాలు

ఇవి ఉష్ణ రక్త జీవులు. బాహ్య చర్మం నుంచి ఏర్పడే రోమాలుంటాయి. తిమింగలాలు, ఆర్మాడిల్లోలో రోమాలు క్షీణించి ఉంటాయి.

చర్మంలోని స్వేద గ్రంథులు విసర్జనకు, ఉష్ణోగ్రతా క్రమతకు సహాయపడతాయి. క్షీర గ్రంథులు రూపాంతరం చెందిన స్వేద గ్రంథులు.

థీకోడాంట్‌ దంత విన్యాసం, ద్వివార, విషమ దంతి రకపు దంతాలు ఉంటాయి.

రెండు కర్ణికలు, రెండు జఠరికలతో నాలుగు గదులు గల హృదయం ఉంటుంది. పుపుస శ్వాసక్రియ జరుగుతుంది.

క్రియాత్మక మూత్రపిండాలు అంత్య వృక్క రకానికి చెందినవి.

వరాశిక, లౌతికళ, మృద్వి అనే మూడు మెనింజస్‌ ఉంటాయి.

ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు కంగారూ. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. కాబట్టి ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి అంటారు.

మానవుల్లో కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు ఉంటాయి.

మానవుడి దంత సూత్రం= 2123/2123

జలచర క్షీరదాల అధ్యయనాన్ని సీటాలజీ అంటారు.

గుడ్లు పెట్టే క్షీరదం ఎకిడ్నా దీన్నే ‘స్పైన్‌ ఆంట్‌ ఈటర్‌’ అంటారు.

ఆడ, మగ జీవులు పాలిచ్చే క్షీరదం డక్‌బిల్డ్‌ ప్లాటిపస్‌.

ఎక్కువ దంతాలు కలిగి, తక్కువ గర్భావధి కాలం గల క్షీరదం- అపోజం

సముద్రానికి ఆనకట్టలు కట్టే క్షీరదం- బీవర్‌

అతిపెద్ద భూచర జంతువు- ఏనుగు

అతివేగంగా పరిగెత్తే జంతువు -చిరుతపులి

ఎగిరే క్షీరదం- గబ్బిలం

నేలపై నివసించే క్షీరదాలు

వీటిలో నాలుగు చెవులు, నాలుగు చలనాంగాలు ఉంటాయి.

రెండు పూర్వాంగాలు, రెండు చరమాంగాలు ఉంటాయి.

మార్సూపియల్స్‌: పిల్లలను సంరక్షించుకోవడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది.

ఉదా: మాక్రోపస్‌ (కంగారూ)

రోడెంట్స్‌: దవడలు కలిగి ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి.

ఉదా: ఎలుక (రాటస్‌)

ప్రైమేట్స్‌: అభివృద్ధి చెందిన చేతులు, కాళ్లు కలిగి ఉంటాయి. వేళ్లకు గోళ్లు ఉంటాయి. తెలివైన జీవులు. సంఘ జీవులు. కుటుంబం, స్నేహితులతో బంధం ఏర్పరుచుకుంటాయి.

ఉదా: కోతి (మాకాక)

సముద్ర క్షీరదాలు

ఇవి సముద్రపు నీటిలో పెరుగుతాయి.

సముద్రపు నీటిలోనే పిల్లల్ని కంటాయి.

కొన్నింటికి మాత్రమే రోమాలుంటాయి.

మిగతా వాటిలో చేప వలె చర్మం కలిగి ఉంటాయి. ఉదా: డాల్ఫిన్‌ (డెల్ఫినస్‌)

ఎగిరే క్షీరదాలు

ప్రతి ధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్ధేశించుకుంటాయి.

ఇవి నిశాచరులు. చెట్ల తొర్రల్లో, గుహల్లో నివాసాలు ఏర్పరుచుకుని నివసిస్తాయి.

ఉదా: గబ్బిలం (టారోపస్‌)

పక్షులు


ఏవ్స్‌ విభాగంలో ఈకలు గల ద్విపాదులైన పక్షులను చేర్చారు.

పక్షుల్లో జీవక్రియారేటు, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.

అంతరోష్ణ జీవులవడం వల్ల పక్షులు రాత్రివేళల్లో చల్లని వాతావరణంలో చురుకుగా ఉంటాయి.

పక్షులు దూర ప్రాంతాలకు వలస వెళ్లగలుగుతాయి.

పక్షులు థెరాపోడ్‌, డైనోసార్‌ల నుంచి జురాసిక్‌ యుగంలో ఉద్భవించి క్రిటేషియన్‌ యుగంలో ఆధునీకరణ చెందాయి.

టీహెచ్‌. హక్స్‌లే పక్షులను ‘దివ్యమైన సరీసృపాలు’గా అభివర్ణించాడు. జేజడ్‌.యంగ్‌ ‘మాస్టర్‌ ఆఫ్‌ ఎయిర్‌’గా పేర్కొన్నాడు.

పక్షుల సాధారణ లక్షణాలు

ఇవి ఉష్ణ రక్త జీవులు. దేహం పడవ ఆకారంలో కుదించినట్లు ఉంటుంది.

ఇవి ద్విపాదులు. పూర్వాంగాలు రెక్కలుగా రూపాంతరం చెంది ఉంటాయి.

చర్మం పొడిగా ఉంటుంది. చర్మంలో ఒకేఒక పెద్ద గ్రంథి తోక ఆధారంలో ఉండే యూరోపైజియల్‌ లేదా ప్రీన్‌ గ్రంథి. పక్షి దీని నుంచి ముక్కుతో తైలాన్ని గ్రహించి ఈకలను బాగుచేసుకుంటుంది.

చాలా ఎముకలు వాతిలాస్థులు. ఇవి వాయుకోశాల విస్తరణను కలిగి ఉంటాయి.

మహారసి కండరాల వల్ల రెక్క కిందికి కొట్టుకుంటుంది. సూప్రా కోరకాయిడిస్‌ వల్ల రెక్క పైకి కొట్టుకుంటుంది.

పక్షుల రెక్కల్లోని ఎముకల్లో వాయువు నిండి ఉండటం వల్ల ఆకాశంలో ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది.

సాధారణంగా ఎగిరే పక్షుల కంటే ఎగిరే పక్షుల శరీరం బరువుగా ఉంటుంది.

శరీర బరువు తక్కువగా ఉండటం కూడా ఎగిరే పక్షులకు అనుకూలనం.

జీవించి ఉన్న పక్షుల్లో దంతాలుండవు. ఆహారవాహిక తరచూ ఆహారాన్ని నిల్వచేసే అన్నాశయంగా విస్తరించి ఉంటుంది.

ఊపిరితిత్తులు స్పంజికలుగా ఉంటాయి. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.

రెండు కర్ణికలు, రెండు జఠరికలతో కూడిన నాలుగు గదుల హృదయం ఉంటుంది.

పక్షుల హృదయంలో సిరాసరణి అభివృద్ధి చెంది ఉంటుంది.

క్రియాత్మక మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రాశయం ఉండదు. (ఆస్ట్రిచ్‌లో తప్ప)

మెదడును ఆవరించి వరాశిక, మృద్వి, లౌతికళ మూడు మెనింజెస్‌ ఉంటాయి.

12 జతల కపాల నాడులు ఉంటాయి.

పక్షుల కళ్లు పెద్దవిగా, నిమేషక పటలంతో ఆవరించి ఉంటాయి. కంటిలో దువ్వెన వంటి పెక్టిన్‌ ఉంటుంది.

అంతర ఫలదీకరణం జరుగుతుంది. పక్షులన్నీ అండోత్పాదకాలు. గుడ్లు క్లీడాయిక్‌ రకానికి చెందినవి.

బవేరియా (జర్మనీ)లోని ఉన్నత జురాసిక్‌ శిలల్లో ఆర్కియోప్టరిక్స్‌ లిథోగ్రాఫికా శిలాజాలను కనుగొన్నారు. ఇది సరీసృపాలు, పక్షుల లక్షణాలను ప్రదర్శిస్తుంది. కాబట్టి దీన్ని సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువుగా పరిగణిస్తారు.

చాలా పక్షులు వలస చూపుతాయి.

ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళతాయి.

ఉదా: సైబీరియా దేశం నుంచి ఫిబ్రవరి నెలలో సైబీరియన్‌ కొంగలు భారతదేశానికి వలస వస్తాయి. మళ్లీ జూలై-ఆగస్టు నెలల్లో తిరిగి వెళతాయి.

పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు.

ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త సలీం అలీని ‘ఇండియన్‌ బర్డ్‌ మ్యాన్‌’ అంటారు.

అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవాన్ని ఏటా మే 4న నిర్వహిస్తారు.

అతిచిన్న ఎగరలేని పక్షి- కివి (న్యూజిలాండ్‌ జాతీయ పక్షి)

అతిపెద్ద గుడ్లు పెట్టే ఎగరలేని పక్షి- ఆస్ట్రిచ్‌

నిలబడి గుడ్డుపెట్టే పక్షి- పెంగ్విన్‌

పైదవడ కలిగిన ఏకైక పక్షి- రామచిలుక

అత్యధిక దూరం ప్రయాణించే పక్షి- ఆర్కిటిక్‌ టెర్న్‌

అతివేగంగా ఎగిరే పక్షి- స్విఫ్ట్‌ (జపాన్‌)

అతిపెద్ద రెక్కలు కలిగిన సముద్ర పక్షి- అల్‌బట్రోస్‌

ముందుకు, వెనుకకు ఎగిరే అతిచిన్న పక్షి- హమ్మింగ్‌

ఇండియాలో అంతరించే దశలో ఉన్న అతిపెద్ద పక్షి- బట్టమేక పిట్ట

అంతరించే దశలో ఉన్న మారిషస్‌ జాతీయ పక్షి- డొడొ

పట్టు సంవర్ధనం


వాణిజ్యపరంగా పట్టు ఉత్పత్తి కోసం చేపట్టే పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్‌ లేదా పట్టు పరిశ్రమ అంటారు.

పట్టుపురుగు శాస్త్రీయ నామం- బాంబిక్స్‌ మోరి

పట్టు పురుగులు మల్బరీ ఆకులను తింటాయి.

పట్టు మాత్‌ గొంగళి పురుగు. దీని లాలాజల గ్రంథులు పట్టు గ్రంథులుగా మారి పట్టును ఉత్పత్తి చేస్తాయి.

గొంగళి పురుగులు (కాటర్‌ పిల్లర్స్‌) ఒక నెల రోజుల్లో మల్బరీ ఆకులను విపరీతంగా తిని పెరిగి నాలుగుసార్లు నిర్మోచనం జరుపుకొంటాయి.

పెరగడం పూర్తయ్యాక గొంగళి పురుగు ఆహారం తీసుకోవడం మాని, శరీరం చుట్టూ పట్టుదారాలతో ఒక కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని పట్టుగూడు లేదా కొకూన్‌ అంటారు.

ఈ దశనే ప్యూపా దశ అంటారు.

పూర్తిగా ఏర్పడిన తర్వాత వాటిని మరుగుతున్న నీటిలో ఉంచుతారు. దీని వల్ల లోపల ఉన్న గొంగళి పురుగు చనిపోతుంది.

గొంగళి పురుగును చంపకపోతే అది మాత్‌గా రూపవిక్రియ చెంది కొకూన్‌ను చీల్చుకొని వెలుపలకు వస్తుంది. దీని వల్ల పట్టుదారం ముక్కలై వ్యాపార రీత్యా ఉపయోగపడదు.

కొకూన్లను పట్టుకోవడం రీలింగ్‌ యూనిట్లకు పంపుతారు. పట్టుకోసం కొకూన్ల నుంచి దారాన్ని తీయడాన్ని రీలింగ్‌ అంటారు.

పట్టుదారంలో ఫైబ్రోయింగ్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది.

పట్టులో మల్బరి పట్టుగాక టసార్‌, ఈరీ, మూంగా అనే పట్టు రకాలున్నాయి. ఇవి చాలా చవకైనవి. (నాణ్యమైనవి కావు)

పట్టును దుస్తుల తయారీలోనే గాక, గాలి గుమ్మటాలు, బెలూన్‌లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

పట్టు పరిశ్రమలో ముఖ్యంగా లార్వాలకు వైరస్‌, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పెబ్రయిన్‌ అనే ఏకకణ జీవి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయి. యూజి అనే ఈగ వల్ల కూడా పట్టు పురుగులకు ప్రమాదం కలగవచ్చు.

తేనెటీగలు

తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్‌ అంటారు.

భారతదేశంలో కనిపించే తేనెటీగ శాస్త్రీయ నామాలు- ఎపిస్‌ ఇండికా, ఎపిస్‌ డార్సెట

తేనెటీగలు సాంఘిక జీవులు. ఒక తేనెపట్టులో 50,000 తేనెటీగలుంటాయి.

మొత్తం తేనె పట్టులో ఒక రాణి ఈగ, డ్రోన్‌లు, కూలీ ఈగలు ఉంటాయి.

రాణి ఈగ ఒకటే ఉంటుంది. డ్రోన్‌లు సుమారు 200-300 వరకు ఉంటాయి.

కూలీ ఈగలు 20,000-60,000 వరకు ఉంటాయి.

తేనె ఎంతో విలువైన పోషక పదార్థం. దీనిలో లెవులోజ్‌, డెక్ట్రోజ్‌, మాల్టోజ్‌ వంటి చక్కెరలుంటాయి.

ఇది మంచి యాంటీసెప్టిక్‌ పదార్థం.

దీన్ని ఆయుర్వేద, యునాని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

తేనెపట్టు నుంచి వచ్చే మైనాన్ని కొవ్వొత్తులు, పాలిష్‌ తయారీలో ఉపయోగిస్తారు.

తేనెటీగల విష గ్రంథుల నుంచి సేకరించిన విషాన్ని కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్‌) నివారణలో ఉపయోగిస్తారు.

వాక్స్‌మాత్‌ అనే కీటకం తేనె పట్టులోని మైనం తిని, పట్టులోని గదులను నాశనం చేస్తుంది.