Event-Date 28-10-2020
State Andhra Pradesh
Topic Govt Schemes And Programmes
ఆపదమిత్ర పథకం శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక
krishna-district-has-selected-training-under-apadamitra-scheme

విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపికైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరువేల మంది కమ్యూనిటీ వలంటీర్లను కేంద్రం  సిద్దం చేస్తుంది. దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 30 జిల్లాల్లో ఎంపిక చేసిన  వాలంటీర్ల‌కు శిక్ష‌ణ ఇస్తుంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వలంటీర్లను ప్రభుత్వం  గుర్తించింది. ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వ‌నుంది. అత్యవసరంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ   రాష్ట్రంలోని 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.