Event-Date 28-10-2020
State National
Topic Persons In News
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్
Shashidhar Jagadeesan as MD CEO HDFC Bank

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు స్వీకరించారు. ఆదిత్య పురి అక్టోబర్ 26వ తేదీన పదవీ విరమణ చేశారు. HDFC బ్యాంకు స్థాపించినప్పటి నుంచి సీఈవోగా కొనసాగుతున్న ప్రస్తుత సారథి ఆదిత్య పురి స్థానాన్ని శశిధర్ జగదీశన్ భర్తీ చేయనున్నారు.  54 ఏళ్ల శశి ప్రస్తుతం స్ట్రాటజిక్‌ చేంజ్‌ ఏజెంట్‌గా బ్యాంకులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 27 నుంచి మూడేళ్ల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా శశి నియామకానికి ఆర్‌బీఐ కూడా ఆమోదం తెలిపింది. ఆదిత్య పురి సారథ్యంలో HDFC బ్యాంక్‌ దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ బ్యాంక్‌గా ఎదిగింది. బ్యాంక్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.5.71 లక్షల కోట్లు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.