Event-Date 29-10-2020
State National
Topic Places In News
జమ్మూకశ్మీర్‌లో భూముల కొనుగొలుకు అనుమతి
Anyone in India can now buy land in Jammu and Kashmir

కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, ల‌ద్దాఖ్ లో ఇకపై ఎవరైనా భారతదేశ ప్రజలు ఎవరైనా భూములను కొనొచ్చని కేంద్ర హోం శాఖ అక్టోబర్ 27న గెజిట్ నోటిఫికేష‌న్ ను విడుదల చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు భారతదేశ ప్రజలు ఎవరైనా జమ్మూకశ్మీర్, ల‌ద్దాఖ్ లో భూములను కొనొచ్చు. వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. 
వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.