Event-Date | 23-05-2020 |
State | National |
Topic | Economic Issues |
అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ దిగ్గజం కెకెఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్ఐఎల్ ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను కెకెఆర్‌కు బదలాయించనున్నట్లు తెలిపింది. ఈ రెండు సంస్థల మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆ సంస్థ వెల్లడించింది.దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్, విస్టాఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్ తర్వాత జియోలో కెకెఆర్ కూడా వాటాదారుగా మారింది. ఆసియాలో కెకెఆర్‌కు ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఆధ్వర్యంలో 388 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఇప్పటివరకు జియోలో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లకు చేరింది.
కెకెఆర్-రిలయన్స్ జియో డీల్
- కెకెఆర్-రిలయన్స్ జియో డీల్ జియో ప్లాట్‌ఫామ్‌లకు రూ .4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువ.
- ఈ ఒప్పందంలో జియో ప్లాట్‌ఫామ్‌ల సంస్థ విలువ రూ .5.16 లక్షల కోట్లు.
- ఆసియాలో కెకెఆర్ చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇది
- కెకెఆర్ పెట్టుబడి దాని ఆసియా ప్రైవేట్ ఈక్విటీ & గ్రోత్ టెక్నాలజీ ఫండ్ల నుండి చేయబడుతుంది.
కెకెఆర్ గురించి
- న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం, కెకెఆర్‌ను 1976 లో జార్జ్ రాబర్ట్స్ మరియు హెన్రీ క్రావిస్ స్థాపించారు. అంతర్జాతీయ స్థాయి ఎంటర్‌ప్రైజెస్‌ను నెలకొల్పడం, సాంకేతిక రంగంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది. ఇప్పటికే ఈ సంస్థ 30కి పైగా వివిధ కంపెనీల్లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. భారత్‌లోను ఈ సంస్థ 2006నుంచి తన పెట్టుబడుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
Company Name |
Investment Value |
Stake |
|
Rs 43574 crore |
9.99% stake |
General Atlantic |
Rs 6,598.38 crore |
1.34% stake |
Vista Equity Partners |
Rs 11,367 crore |
2.32% stake |
Silver Lake |
Rs 5,655.75 crore |
1.15% stake |
KKR |
Rs 11,367 crore |
2.32% stake |
.