Event-Date 15-09-2019
State National
Topic Awards And Honours
పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
Swarbharat Award for Power Grid

ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ విభాగంలో పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 13న జలశక్తి మంత్రిత్వశాఖ, తాగునీరు, పారిశుధ్య విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును పవర్‌గ్రిడ్ సీఎండీ కే శ్రీకాంత్‌కు ప్రదానం చేశారు. స్వచ్ఛతకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకుగాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు దక్కింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.