Event-Date | 26-05-2020 |
State | National |
Topic | Persons In News |
భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్(96) మే 25న తుదిశ్వాస విడిచారు. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు బల్బీర్. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా హరిపూర్ ఖల్సా గ్రామంలో 1923, డిసెంబర్ 31న బల్బీర్ జన్మించాడు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బల్బీర్ పేరిట ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరు అధిగమించలేదు. 1952 ఒలింపిక్స్‌లో భారత్ 6-1తేడాతో నెదర్లాండ్‌సపై విజయం సాధించగా అందులో 5 గోల్స్ బల్బీర్ చేసినవే. ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు (1948, 1952, 1956 ఒలింపిక్స్) సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహించారు. భారత ప్రభుత్వం 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే హాకీ ఇండియా.. 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది.