Event-Date 26-05-2020
State International
Topic Persons In News
అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారిణిగా ఒసాకా
Naomi Osaka Is The Highest Paid Female Athlete

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మ‌హిళా అథ్లెట్‌గా జ‌పాన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి న‌వోమి ఒసాకా నిలిచారు. సంపాద‌న‌లో అమెరిక‌న్ దిగ్గ‌జం సెరీనా విలియ‌మ్స్‌ను ఆమె అధిగ‌మించారు. గ‌త 12 నెల‌ల కాలంలో సంపాద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఫోర్బ్స్ మ్యాగ్‌జీన్ వంద మంది అథ్లెట్స్‌తో ఓ జాబితా త‌యారు చేసింది. జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది. మ‌హిళా అథ్లెట్ల‌లో మాత్రం ఆమె మొద‌టి స్థానంలో నిలిచింది. ఒసాకా రూ.284.20 కోట్ల‌తో (37.4 మిలియ‌న్ డాల‌ర్లు) అగ్ర‌స్థానంలో నిలిచింది.  ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే న‌వోమి ఒసాకా రూ.10.64 కోట్లు (1.4 మిలియన్‌ డాలర్లు) ఎక్కువ‌ సంపాదించి రికార్డు సృష్టించింది. 22 ఏండ్ల ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుపొందింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.