Event-Date 29-05-2020
State International
Topic Awards And Honours
భారత సంతతి శాస్త్రవేత్తకు ఇన్వెంటర్ అవార్డు
Indian American Scientist Wins Inventor Of The Year Award

ఎలక్ట్రానిక్ పరిశ్రమలను అభివృద్ధిపరిచడంలోనూ, కృత్రిమ మేధస్సు సమర్థతని మెరుగుపర్చడంలోనూ అత్యున్నత ప్రతిభ కనబర్చినందుకుగాను భారతీయ సంతతికి చెందిన రాజీవ్ జోషిని ప్రతిష్టాత్మక ‘ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు వరించింది. అమెరికాలో దాదాపు 250కి పైగా ఆవిష్కరణలు చేసిన డాక్టర్ జోషి న్యూయార్క్‌లోని ఐబీఎం థాంసన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి అరుున ఆయన మశాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.