Event-Date 13-11-2020
State National
Topic Awards And Honours
జాతీయ జల అవార్డులు-2019
Ministry of Jal Shakti organise 2nd National Water Awards

2019 సంవత్సరానికి గాను కేంద్ర జల్ శక్తి శాఖ 2వ జాతీయ జల అవార్డులను (ఎన్‌డబ్ల్యుఏ) ప్రకటించింది.  జల సంరక్షణ-నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఆన్‌లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 2020, నవంబర్ 11, 12వ తేదీలలో జరిగింది.  2020 ఏడాది అవార్డులకుగాను మొత్తం 1,112 దరఖాస్తుల్లో మొత్తం 98 మంది విజేతలను 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు. 2019 ఏడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం-జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.