Event-Date 13-11-2020
State Telangana
Topic Persons In News
న్యూస్‌ రీడర్‌ ఏడిద గోపాలరావు కన్నుమూత
air-news-reader-edida-gopala-rao-passed-away

ఢిల్లీ కేంద్రంగా మూడు దశాబ్దాలుగా గంభీరస్వరంతో అనేక జాతీయ,అంతర్జాతీయ వార్తలు వినిపించిన రేడియా న్యూస్‌ రీడర్‌ ఏడిద గోపాలరావు(83) నవంబర్ 12న బోరబండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1995లో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు వారధిగా నిలిచారు. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు సోదరుడు. ఆయన 1966 నుంచి 1996 వరకూ న్యూస్‌ రీడర్‌గా ఆకాశవాణిలో సేవలందించారు. సోషలిస్టు రష్యాలోని మాస్కో రేడియోలోనూ నాలుగేళ్లు పనిచేశారు. పన్నెండు గంటలపాటు నిర్విరామంగా వార్తలు చదివి ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’కెక్కారు. ‘కరుణామయుడు’ సినిమాలోనూ ఆయన నటించారు. గోపాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొత్తపేట. గోపాలరావుకు రంగస్థల గాంధీగా పేరు. ‘నేతాజీ’, ‘బాపు చెప్పినమాట’ నాటికల్లోని బాపూజీ పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డుల స్ర్కీనింగు కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.