Event-Date | 13-11-2020 |
State | Telangana |
Topic | Awards And Honours |
రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కుసుమరామయ్య బాలుర ఉన్నతపాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పాతూరి మహేందర్‌రెడ్డి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కరోనా లాక్‌డౌన్‌కాలంలో ఆన్లైన్కోర్సులు, వెబ్నార్లు, క్విజ్లు, ప్లెడ్జ్లు, సోషల్ కంట్రీబ్యూషన్ల వంటి ఆన్లైన్ కార్యక్రమాల్లో ప్రతిభ చాటి కేవలం వందరోజుల్లో 400 అప్రిసియేషన్ అండ్ పార్టిసిపేషన్, యోగ్యత, అభినందన వంటి ఆన్లైన్ పత్రాలను సంపాదించారు. స్వల్పకాలవ్యవధిలో ఈ ఘనత సాధించినందుకు ‘వండర్ బుక్ఆఫ్రికార్డ్స్'లో చోటు కల్పించిం ది.