Event-Date | 13-11-2020 |
State | National |
Topic | General |
కృత్రిమ మేధస్సు (ఏఐ), సమాచార విశ్లేషణ (డీఏ)కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కలిసి ముందుకు సాగేందుకు దక్షిణ మధ్య రైల్వేలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 12న వర్చువల్ విధానంలో రైల్వేబోర్డు చైర్మన్ వినోద్కుమార్యాదవ్ సమక్షంలో సికింద్రాబాద్ రైల్నిలయంలో ఎస్సీఆర్ జీఎం గజానన్ మాల్యా, ఐఎస్బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహన్కు ఒప్పందపత్రాలను అందించారు. ఈ ఒప్పందం ఏడాదిపాటు అమలులో ఉంటుంది.