Event-Date | 29-05-2020 |
State | National |
Topic | General |
ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగమైన ‘చంబా’ సొరంగ మార్గాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మే 26న ప్రారంభించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) రిషికేశ్-ధరాసు రోడ్ హైవే (ఎన్హెచ్-94)లో బిజీగా ఉన్న చంబా పట్టణానికి దిగువన 440 మీటర్ల పొడవైన సొరంగం తవ్వడం ద్వారా ఈ ప్రధాన మైలురాయిని సాధించింది. కోవిడ్-19, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో గొప్ప పురోగతి సాధించారు. చార్ధామ్ను గంగోత్రి, కేదార్నాథ్, యమునోత్రి, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలతో కలిపే రూ.12 వేల కోట్ల శివాలిక్ ప్రాజెక్టులో ఈ సొరంగం ఒక భాగం. దీని నిర్మాణానికి రూ.107 కోట్లు కేటారుుంచారు.