Event-Date 14-11-2020
State National
Topic Awards And Honours
బంగ్లాదేశ్‌ కుర్రాడికి బాలల శాంతి పురస్కారం
Bangladeshi teen wins Intl Childrens Peace Prize

17 ఏళ్ల బంగ్లాదేశ్‌ కుర్రాడు సదత్‌ రెహ్మాన్‌ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాన్ని సాధించాడు. సైబర్‌ వేధింపులను అడ్డుకునేందుకు విశేషంగా కృషి చేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. హేగ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నాడు. సైబర్‌ వేధింపులను అడ్డుకునే కృషిలో భాగంగా రెహ్మాన్‌ ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించాడు.  సైబర్‌ వేధింపులతో ఓ 15 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసుకున్న ఘటన రెహ్మాన్‌ను కదిలించడంతో వీటికి అడ్డుకట్ట వేయాలన్న కృతనిశ్చయంతో రంగంలోకి దిగాడు. ఈ ప్రఖ్యాత అంతర్జాతీయ బాలల పురస్కారాన్ని గతంలో పాక్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌, స్వీడన్‌ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్‌ అందుకున్నారు. మలాలా తర్వాత నోబెల్‌ శాంతి బహుమతి కూడా అందుకున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.