Event-Date 29-05-2020
State National
Topic Govt Schemes And Programmes
రెండో దశ స్వచ్ఛ భారత్‌కు రూ.1.40 లక్షల కోట్లు
second phase of Swachh Bharat Mission

గ్రామాల్లో రెండో దశ స్వచ్ఛ భారత్ పథకం అమలుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020, ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలుకు కేంద్రం రూ.1,40,881 కోట్లు ఖర్చు చేయనుంది. 2014-19 మధ్య తొలి దశ స్వచ్ఛ భారత్‌లో పట్టణాలు, గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను రూపుమాపాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించారుు. రెండో దశలో ప్రతి ఇంటి నుంచి చెత్త, చెదారాన్ని సేకరించడం, ప్రతి ఇంటి నుంచి బయటకొచ్చే మురుగు నీరు రోడ్లపైకి చేరకుండా చర్యలు చేపడతారు. మొత్తం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటారు. అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తారు. ఈ పథకానికయ్యే మొత్తం ఖర్చులో 70శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తారుు. 70శాతం వాటా నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40శాతం నిష్పత్తిలో భరిస్తారుు. మిగిలిన 30శాతం గ్రామ పంచాయతీలు ఖర్చు చేయాలి.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.