Event-Date 31-05-2020
State National
Topic Persons In News
మాతృభూమి దినపత్రిక వీరేంద్రకుమార్ మృతి
Mathrubhumi MD MP Veerendra Kumar passes away

మాతృభూమి మళయాళ దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్, రాజ్యసభ సభ్యుడు, వీరేంద్ర కుమార్ మే 28న కన్నుమూశారు. ఈయన సోషలిస్ట్ పార్టీ నాయకుడు పద్మప్రభ గౌడర్ కుమారుడు. 1987-91 కాలంలో వీరేంద్రకుమార్ కేరళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో కోజికోడ్ నుంచి లోక్ సబ ఎంపీగా విజయం సాధించి కేంద్ర కార్మిక, ఆర్థికశాఖల సహాయమంత్రిగా పనిచేశారు. మాతృభూమి దినపత్రికను స్థాపించి దానికి ఎండీగా వ్యవహరించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003-2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికై న ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.