Event-Date 17-11-2020
State National
Topic Awards And Honours
సోన్‌సూద్‌కు అరుదైన గౌరవం అందించిన ఆయన సొంతరాష్ట్రం
sonu-sood-appointed-as-punjab-state-icon-by-election-commission-of-india

నటుడు సోనూసూద్‌ను భారత ఎన్నికల సంఘం పంజాబ్ రాష్ట్రానకి ఐకాన్‌గా నియమించింది. సోనూసూద్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఆయనను పంజాబ్ ఐకాన్‌గా నియమించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు తెలిపారు. ఆ ప్రతిపాదనను ఎన్నికల సంఘం ఆమోదించడంతో.. సోనూసూద్‌ను ఐకాన్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర సీఈఓ కరుణరాజు ప్రకటించారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన సోనూసూద్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలు వారివారి ఇళ్లకు చేరుకోవడంలో ఎంతగానో సాయం చేశారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.