Event-Date 17-11-2020
State National
Topic Science And Technology
స్పేస్‌స్టేష‌న్‌కు న‌లుగురు వ్యోమ‌గాములు
four-astronauts-head-to-iss-by-spacex-rocket

అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ .. న‌లుగురు వ్యోమ‌గాముల్ని అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు ఫాల్క‌న్ 9 రాకెట్‌లో పంపింది. ఫ్లోరిడా నుంచి ఐఎస్ఎస్‌కు స్పేస్ఎక్స్ సంస్థ త‌న రాకెట్‌ను నింగిలోకి ప్ర‌యోగించింది. డ్రాగ‌న్ క్రూలో వెళ్తున్న వ్యోమ‌గాముల్లో.. ముగ్గురు అమెరిక‌న్లు, ఓ జ‌పాన్ ఆస్ట్రోనాట్ ఉన్నారు.  అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వ్యోమ‌గాముల్ని త‌ర‌లించ‌డం స్పేస్ఎక్స్ సంస్థ‌కు ఇది రెండ‌వ‌సారి కావ‌డం విశేషం.  అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్తున్న వారిలో అమెరికా ఆస్ట్రోనాట్లు మైఖేల్ హాప్కిన్స్‌, విక్ట‌ర్ గ్లోవ‌ర్‌, షాన‌న్ వాల్క‌ర్ ఉన్నారు. ఇక జ‌పాన్‌కు చెందిన జాక్సోనాట్ సొచి న‌గూచి కూడా ఉన్నారు.  జపాన్ ఆస్ట్రోనాట్‌ను న‌గూచి అంత‌రిక్షంలోకి మూడుసార్లు వెళ్లారు. అయితే ఆయ‌న మూడుసార్లు భిన్న అంత‌రిక్ష వాహ‌నాల్లో ప్ర‌యాణించారు. ఓసారి రష్యాకు చెందిన సోయేజ్‌, అమెరికా నాసాకు చెందిన ష‌టిల్ స‌ర్వీస్, ఇక ఇప్పుడు స్పేస్ఎక్స్ రాకెట్‌లో అత‌ను ప్ర‌యాణించారు.   

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.