Event-Date 31-05-2020
State National
Topic Persons In News
ఛత్తీస్‌గఢ్ తొలి సీఎం అజిత్ జోగి కన్నుమూత
Ajit Jogi Chhattisgarhs first CM passes away

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి కన్నుమూశారు. 2000 నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటు కాగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆయన 2003 వరకు ఆ రాష్ట్ర తొలి సీఎంగా ఉన్నారు. ఐఏఎస్‌ అధికారి అయిన అజిత్‌ జోగి రాజకీయాల్లోకి వచ్చి జన నేతగా ఎదిగారు. 2016లో విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె) పార్టీని ఏర్పాటు చేశారు.  ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎ‌న్నిక‌య్యారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ టెక్నాల‌జీ కాలేజీలో జోగి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయ‌న యూనివ‌ర్సిటీ గోల్డ్ మెడ‌ల్ సాధించారు.  రాయ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కొన్నాళ్ల పాటు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. రాజకీయాల్లో చేరటానికి ముందు ఆయన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.