Event-Date 31-05-2020
State National
Topic Science And Technology
ఓపెన్ సోర్స్ కోడ్ లో ఆరోగ్య సేతు యాప్
Aarogya Setu becomes open source

దేశంలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసలు కురిపించింది. ఈ యాప్ సంబంధించిన ఓపెన్‌సోర్స్ కోడ్‌ను నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ విడుదల చేసింది.  ఈ సందర్భంగా ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ఆరోగ్య సేతు యాప్‌ను కేంద్రం ప్రారంభించగా.. ఇప్పటి వరకూ దీనిని 11.2 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ సోర్స్ కోడ్ గిట్‌హబ్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారి 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.