Event-Date 20-11-2020
State Telangana
Topic Awards And Honours
సిద్దిపేట జిల్లాకు జాతీయ స్థాయి స్వచ్ఛ అవార్డు
national-level-clean-award-for-siddipet-district

ప్రపంచ టాయిలెట్‌ దినోత్సవ వేడుకలో భాగంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంపొందించడం, ద్రవ, ఘన పదార్థాల నిర్వహణ శ్రమదానాలు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో కనబర్చిన ప్రదర్శన ఆధారంగా దేశవ్యాప్తంగా 20 జిల్లాలను ఎంపిక చేయగా  సిద్దిపేట జిల్లాకు జాతీయ స్థాయి స్వచ్ఛ అవార్డు లభించింది.  తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దిపేట జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లా అవార్డుకు ఎంపికైంది. కొవిడ్‌-19 నేపథ్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, రాష్ట్ర మంత్రులు జాతీయ స్థాయి స్వచ్ఛ అవార్డును సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఆన్‌లైన్‌ వేదికగా అందించారు.  

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.