Event-Date 20-11-2020
State National
Topic Sports And Games
హంగేరీ చాంప్‌ లియోన్‌
chess-indias-14-year-old-leon-mendonca-closes-in-on-grandmaster-title

భారత వర్ధమాన చెస్‌ ఆటగాడు లియోన్‌ మెన్‌డోన్కా.. హంగేరీ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాతో ఈ టోర్నీలో అడుగుపెట్టిన 14 ఏండ్ల లియోన్‌.. గ్రాండ్‌ మాస్టర్లను ఓడించి మరో రౌండ్‌ మిగిలుండగానే టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. ఇటీవల బుడాపెస్ట్‌ టోర్నీలో ఒక జీఎం నార్మ్‌ను సొంతం చేసుకున్న లియోన్‌.. తాజా విజయంతో రెండో జీఎం నార్మ్‌ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 9 రౌండ్ల చాంపియన్‌షిప్‌లో ఆరు విజయాలు, 3 ‘డ్రా’లు నమోదు చేసిన మెన్‌డోన్కా 7.5 పాయింట్లతో టైటిల్‌ దక్కించుకున్నాడు. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని లియోన్‌.. ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లను మట్టికరిపించడం విశేషం.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.