Event-Date 21-11-2020
State Telangana
Topic Persons In News
తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
justice-sridevi-takes-oath-as-telangana-high-court-first-woman-judge

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి నవంబర్ 19 ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జస్టిస్ శ్రీదేవి.. ఉత్తర్‌ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్‌కు అఖిలభారత కోటాలో ఎంపికయ్యారు. అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శ్రీదేవిని రెండేళ్ల కిందట తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ శ్రీదేవిని పూర్తిస్థాయి జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.