Event-Date 21-11-2020
State International
Topic Foreign Relations
లక్సెంబర్గ్ ప్రధానితో భారత ప్రధాని సమావేశం
Narendra Modi holds virtual summit with Luxembourg PM Bettel

లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ 19న వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలపేతం, ఆర్థికం, వాణిజ్యం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను విస్తరించుకునే అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించాయి. రెండు దశాబ్దాల విరామం తర్వాత భారత్-లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సదస్సు జరిగింది. అనంతరం ఆర్థిక రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలుగా ఇరు దేశాలు మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.