Event-Date 22-11-2020
State National
Topic General
దేశంలో మొట్టమొదటిసారిగా నాచు ఉద్యానవనం
garden-with-plants-and-shrubs

దేశంలో మొట్టమొదటిసారిగా నాచు ఉద్యానవనం (మాస్‌ గార్డెన్‌) సిద్ధమైంది. ఉత్తరాఖండ్‌లో నైనిటాల్‌ జిల్లాలోని ఖుర్పతాల్‌ పట్టణంలో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ జల సంరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్‌ ఈ నాచు గార్డెన్‌ను నవంబర్ 19 ప్రారంభించారు. ప్రకృతి పరిరక్షణకు, వరదలను అడ్డుకునేందుకు నాచు ఏ విధంగా సాయపడుతుందో తెలియజేయడానికే ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేసినట్టు అటవీ శాఖ అధికారి సంజీవ్‌ చతుర్వేది తెలిపారు. 1.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.