Event-Date 23-11-2020
State International
Topic General
లావాలో 2 వేల ఏళ్ల నాటి శవాలు
2000-years-old-lava-filled-bodies-found-pompeii

దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం అగ్ని పర్వతపు లావాలో చిక్కుపోయి శిలలా మారిన ఇద్దరు వ్యక్తుల శవాలను ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని వెలికి తీశారు. క్రీస్తుపూర్తం 79లో పాంపేలోని ప్రాచీన రోమన్‌ సిటీకి దగ్గరలోని మౌంట్‌ వెసువిస్‌ అగ్ని పర్వతం బద్దలైంది. లావాలో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. అయితే లావాతో కప్పబడి పోయిన శవాలు మాత్రం చెక్కు చెదరకుండా మిగిలిపోయాయి. తాజాగా నవంబర్‌ నెలలో ఇద్దరు వ్యక్తులకు చెందిన శవ శిలలను కనుగొన్నారు. లావానుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన ధనికుడు అతడి సేవకుడికి చెందిన శవాలుగా గుర్తించారు. ఓ వ్యక్తికి 18-25 సంవత్సరాల వయస్సు.. మరో వ్యక్తికి 30-40 ఏళ్ల వయసు మధ్య ఉంటుందని తెలిపారు. 2017లో ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. మూడు గుర్రాల శిలలు బయటపడ్డాయి.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.