Event-Date 23-11-2020
State Telangana
Topic Persons In News
ప్రముఖ సర్జన్ డాక్టర్ పి వి చలపతిరావు కన్నుమూత‌
noted-surgeon-dr-p-v-chalapathi-rao-passes-away

ప‌్ర‌ముఖ స‌ర్జ‌న్‌, డాక్ట‌ర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్ర‌హీత, డాక్ట‌ర్ పీవీసీ రావుగా పేరుగాంచిన డాక్ట‌ర్ పి.వి.చ‌ల‌ప‌తిరావు నవంబర్ 22న  క‌న్నుమూశారు. 1994లో తెలుగు మాట్లాడే రాష్ర్టాల నుంచి అసోసియేష‌న్ ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు అధ్య‌క్షుడిగా ఎన్నికైన మొద‌టివ్య‌క్తి వీవీసీ రావు. ఈయ‌న కుమారుడు డాక్ట‌ర్ పి. ర‌ఘురామ్ ప్ర‌ముఖ అంకాల‌జిస్టు. ప్ర‌స్తుతం ఏఎస్ఐ అధ్య‌క్షుడిగా ఉన్నారు. సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ చలపతి రావు 1983లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ సర్జరీ విభాగాధిపతిగా పనిచేశారు. తరువాత అభ (సౌదీ అరేబియా) లో చీఫ్ సర్జన్‌గా పనిచేశారు. 1991 నుంచి 2002 మధ్య ఒక దశాబ్దం పాటు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ చైర్మన్‌గా పనిచేశారు. 2004 నుండి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలో వైద్య విద్య డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.