Event-Date 26-11-2020
State International
Topic Sports And Games
ఐసీసీ దశాబ్దపు అవార్డుల రేసులో భారత ఆటగాళ్లు
virat-kohli-ravichandran-ashwin-nominated-for-icc-player-of-the-decade-award

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గడిచిన పదేళ్ల కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు అందజేయనుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద డికేడ్’తో పాటు టెస్టు, వన్డే, టి20ల్లో వేర్వేరుగా అవార్డులు ప్రకటిస్తారు. ఇందు కోసం ఐసీసీ పలువురు స్టార్ ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించింది. భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలో నిలిచారు. వీరితో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, డివిలియర్స్, సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు. వన్డే అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్‌తో పాటు ఎమ్మెస్ ధోని, రోహిత్ శర్మ, మలింగ, స్టార్క్, డివిలియర్స్, సంగక్కర పోటీ పడుతున్నారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో విడివిడిగా కూడా కోహ్లి పేరు నామినేట్ అయింది.  టెస్టులు, వన్డేలు, టి20ల్లో విడివిడిగా కూడా కోహ్లి పేరు నామినేట్ అయింది. గత పదేళ్లలో మూడు ఫార్మాట్‌లలో కలిపి విరాట్ కోహ్లి సుమారు 20 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 70 సెంచరీలు ఉండగా, అన్నింటిలోనూ అతని సగటు 50కి పైగా ఉంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.