Event-Date 31-05-2020
State Telangana
Topic Govt Schemes And Programmes
కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు
Kondapochamma Sagar Reservoir gets godavari water

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరాయి. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి చేరింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మే 29న మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.