Event-Date 27-11-2020
State International
Topic Sports And Games
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత
Maradona eyelid with heart attack

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా గుండె పోటుతో కన్నుమూశారు. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986 సాకర్ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు టైటిల్ గెలిచింది. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. 
1976లో అర్జెంటీనా జూనియర్ జట్టుకు ఆడిన మారడోనా ఆ తర్వాతి ఏడాదే సీనియర్ జట్టుకు ఎంపికై అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్లబ్ జట్ల తరఫున 491 గేములు ఆడిన ఈ అర్జెంటీనా క్రీడాకారుడు 259 గోల్స్ చేశాడు. తన స్వదేశం అర్జెంటీనాకు 91 గేముల్లో ప్రాతినిధ్యం వహించి 34 గోల్స్ నమోదు చేశాడు.

  • పుట్టిన తేదీ: అక్టోబర్ 30, 1960
  • పుట్టిన స్థలం: బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
  • 1976 అర్జెంటీనా జూనియర్ జట్టులో స్థానం
  • 1977 అర్జెంటీనా సీనియర్ జట్టులో చోటు
  • 1986 మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. 
  • 1994 అమెరికాలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు.
  • 1997 రివర్ ప్లేట్ క్లబ్‌తో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు.
  • 2008-2010 రెండేళ్లపాటు అర్జెంటీనా జాతీయ సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
  • నవంబర్ 25, 2020 గుండెపోటుతో బ్యూనస్ ఎయిర్స్‌లో కన్నుమూత

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.