Event-Date 01-06-2020
State National
Topic Persons In News
కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశం నియామకం
paramesham appointed krmb chairman

కృష్ణానదీ యాజమాన్యం బోర్డు (కెఆర్‌ఎంబి)ఛైర్మన్‌గా కేంద్రప్రభుత్వం ఎ.పరమేశంను నియమిస్తూ కేంద్రజలశక్తి శాఖ ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాకు కేంద్రం పదోన్నతి కల్పించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యునిగా నవంబర్ 30న నియమించింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న ఆర్కే జైన్‌కు కేంద్రం పదోన్నతి కల్పించి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్, పీపీఏ సీఈవో బాధ్యతలను కూడా గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహిస్తూ వస్తున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.