Event-Date 01-06-2020
State National
Topic Persons In News
ఐఎన్‌ఎస్ సర్కార్ కమాండర్‌గా గోఖలే
Commodore Rahul Vilas Gokhale takes over command of INS Circars

తూర్పు నావికాదళం (ఈఎన్‌సీ) ప్రధాన కార్యాలయం అయిన ఐఎన్‌ఎస్ సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్‌గా రాహుల్ విలాస్ గోఖలే మే 30న పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సంప్రదాయ పుల్లింగ్ అవుట్ వేడుక ద్వారా ప్రస్తుత కమాండర్ కె.ఎ.బోపన్నకు ఐఎన్‌ఎస్ సర్కార్ అధికారులు, నేవీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కమాండర్ కె ఎ .ఎ.బోపన్న 35 సంవత్సరాల ప్రఖ్యాత కెరీర్ తర్వాత క్రియాశీల నావికాదళ సేవ నుండి రిటైర్ అవుతున్నారు. ఐఎన్ఎస్ సర్కార్ యొక్క ఇరవై మూడవ కమాండింగ్ ఆఫీసర్ అయిన కమాండర్  ఆర్వి గోఖలే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క పూర్వ విద్యార్థి మరియు 1992 లో జనవరి 1వ తేదీన భారత నావికాదళంలో చేరారు. ఐఎన్‌ఎస్ ఖుక్రీ, ఐఎన్‌ఎస్ కోల్‌కత్తాలలో నేవిగేషన్ అండ్ డెరైక్షన్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. న్యూఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్ వద్ద డెరైక్షన్ పర్సనల్ పాలసీ అడ్వైజర్‌గా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వద్ద హైకమిషన్ ఆఫ్ ఇండియా నావల్ అడ్వైజర్‌గానూ గోఖలే విధులు నిర్వర్తించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.