Event-Date 01-12-2020
State National
Topic Persons In News
అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అరుదైన ఘనత
virat-kohli-becomes-fastest-batsman-to-score

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లీ 40 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, రోహిత్‌శర్మ ఉన్నారు.  250 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లి టీమిండియా తరఫున 86 టెస్టులు, 82 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.