Event-Date 11-02-2020
State National
Topic General
35 ఏళ్ల తర్వాత ఆ ఏనుగుకు విముక్తి
elephant-fly-pakistan-cambodia

శ్రీలంక నుంచి తెచ్చిన ఏనుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రజలను అలరిస్తోంది. దాని పేరు కావన్ (Kaavan). 35 ఏళ్ల క్రితం గున్న ఏనుగైన కావన్ ను పాక్ కు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీలంక. 2012లో కావన్ తోడైన సహేలీ మరణించింది. ప్రపంచంలో ఒంటరిగా నివసిస్తున్న ఏకైక ఏనుగుగా (lonely elephant) కావన్ చరిత్ర సృష్టించడంతో, అంతర్జాతీయంగా దీని పేరు మారుమోగిపోయింది. ఇలా సుమారు 8 ఏళ్లపాటు జీవనం గడిపిన కావన్ కు ప్రస్తుతం 36 ఏళ్లు. ఇస్లామాబాద్ లోని ఓ చిన్న జూ నుంచి ఇప్పుడు దీన్ని కాంబోడియాకు తరలించాలంటూ హైకోర్టు తుది తీర్పుతో కావన్ ఒంటరితనానికి ఫుల్ స్టాప్ పడింది. జూ నుంచి ఈ ఏనుగును ఇస్లామాబాద్ (Islamabad) విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి ఏనుగు కోసం ప్రత్యేకంగా తెప్పించిన రష్యన్ స్పెషల్ జెట్ లో కాంబోడియాకు తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని బరువు 5 టన్నులు.  అమెరికన్ సింగర్ షేర్ (Cher) ఈ ఏనుగును కాపాడాలంటూ, వేరే దేశానికి తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కావన్ ను కాంబోడియా (Cambodia) కు తరలించే నిర్ణయం తీసుకున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ జంతు సంరక్షక సంస్థ నాన్-హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ (Non-human Rights Project) ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసింది. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.