Event-Date 01-12-2020
State National
Topic Persons In News
లోక్‌సభ జనరల్‌ సెక్రటరీగా ఉత్పల్ కుమార్ సింగ్
ias-officer-utpal-kumar-singh-elected-lok-sabha-secretary-general

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ లోక్‌సభ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాజీ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాత్సవ స్థానంలో ఉత్పల్‌  కుమార్‌ సింగ్‌ను ఎన్నిక చేసిన్నట్లు సచివాలయం నవంబర్ 30న ఉత్తర్వులు జారీచేశారు.  ఉత్తరాఖండ్ కేడర్‌ 1986 ఐఏస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన డిసెంబర్‌ 1వ తేదీన లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా‌ బాధ్యతలు చేపట్టానున్నారు. ప్రస్తుతం ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ను లోక్‌సభ సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నారు. రెండేళ్లకు పైగా ఆయన ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయనకు 34 ఏళ్ల అనుభవం ఉంది. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.