Event-Date 01-12-2020
State National
Topic General
నేడు గురునానక్‌ జయంతి
guru-nanak-jayanti-2020-wishes

నేడు గురుపూరబ్‌ సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, ఇతరులు గురునానక్‌ జయంతిని జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్‌, నవంబర్‌ నెలలో గురునానక్‌ జయంతిని పురస్కరించుకుంటారు. ఈరోజు గురుద్వారాలలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ను పఠిస్తారు. ఇది 48 గంటలపాటు నిరంతరంగా సాగుతుంది. దీనిని అఖండపఠనం అంటారు. జయంతి నాడు ఉదయాన్నే కీర్తనలతో, ప్రార్థనలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. గురు గ్రంథసాహిబ్‌ను పల్కిలో చుట్టి, పూలతో అలంకరించి రథంలో తీసుకెళ్తారు. ఈ సంవత్సరం 551 వ గురునానక్‌ జయంతిని జరపుకుంటున్నారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.