Event-Date 01-12-2020
State Andhra Pradesh
Topic General
విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక
oslo-transport-sea-ship-reached-visakhapatnam-sea-port

విశాఖ పోర్టు ఇన్నర్‌ హార్బర్‌కు 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పు కలిగిన భారీ సరుకు రవాణా (కార్గో) షిప్‌ డబ్ల్యు ఓస్లో నవంబర్ 30న పోర్ట్ ఇన్నర్ హార్బర్‌లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగి ఉంది. అధికారలు ఏడో బెర్త్‌ను ఇచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్‌తో విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్‌ను కలిగిన కార్గో నౌక రావటం గొప్ప విషయమని ఓడరేవు అధికారులు భావిస్తున్నారు. సౌత్‌ ఆఫ్రియాలోని రిచర్డ్‌ బె పోర్టు నుంచి వచ్చిన ఈ షిప్‌లో 87,529 మెట్రిక్‌ టన్నుల నాన్‌ కుకింగ్‌ కోల్‌ ఉంది. ఈ సరుకులో శారదా మెటల్స్‌ అండ్‌ అల్లోరుస్‌కు 27,029 మెట్రిక్‌ టన్నులు, శారద ఎనర్జీ అండ్‌ మినరల్స్‌కు 60,500 టన్నులు చేరనుంది. విశాఖలోని గ్రీన్‌ ఎనర్జీ అనే స్టీవ్‌ డోర్‌ కంపెనీకి చెందిన చౌగ్లీ అనే ఏజెంట్‌ ద్వారా ఇది ఇక్కడకు వచ్చింది. పోర్టు హార్బర్‌లోని ఈక్యూ బెర్త్‌ నెంబరు 7లో వెనువెంటనే ఈ భారీ నౌకకు బెర్త్‌ను అందజేశారు.  ఓస్లో నౌకను చైనాలో 2011లో నిర్మించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.