Event-Date 01-06-2020
State International
Topic Foreign Relations
WHOతో అమెరికా తెగదెంపులు
Trump terminates US relationship with WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.  డబ్ల్యూహెచ్‌ఓకు అత్యధికంగా 45కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుతుండగా చైనా 4కోట్ల డాలర్లిచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే, చైనా నుంచి ప్రయాణాలపై నిషేధం విధించి ఉండేవాడిని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.