Event-Date 01-12-2020
State National
Topic General
డ్రగ్స్‌ వినియోగంలో వరల్డ్ టాప్‌ టెన్ నగరాల జాబితా
top-ten-cities-in-the-world-for-drug-consumption-list

ప్రపంచంలోని టాప్‌-10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉందనీ, ఢిల్లీవాసులు ఏటా 34 వేల 708 కిలోల డ్రగ్స్‌ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారని జర్మనీకి చెందిన ఏబీసీడీ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ఈ‌ పరిశోధన సంస్థ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్‌ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది.

ఏబీసీడీ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్‌ వినియోగం లో న్యూయార్క్‌ నగరం మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడి ప్రజలు ప్రతి ఏటా 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. పాకిస్తాన్ లో ని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు. నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంలో టాప్‌-10 నగరాల్లో ఢిల్లీ, ముంబై చోటు సాధించాయి. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.