Event-Date 01-12-2020
State National
Topic Economic Issues
ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
sebi-bars-ndtv-promoters-prannoy-and-radhika-roy

ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీటీవీ)షేర్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా  రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా  సెబీ వద్ద డిపాజిట్‌ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 2006 సెప్టెంబర్‌– 2008 జూన్‌ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్‌ రాయ్‌ ఎన్‌డీటీవీకి చైర్మన్‌గా, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.