Event-Date | 02-12-2020 |
State | International |
Topic | Science And Technology |
నక్షత్రాలు, పాలపుంతలకు చెందిన కొత్త మ్యాప్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విడుదల చేసారు. ఓ ఎడారిలో ఉన్న ఆధునిక టెలిస్కోప్‌తో ఆ నక్షత్ర సమూహాలను గుర్తించారు. లక్షల సంఖ్యలో ఉన్న గెలాక్సీలను మ్యాపింగ్ చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. జాతీయ సైన్స్ ఏజెన్సీ సీఎస్ఐఆర్వోకు చెందిన కొత్త టెలిస్కోప్ ఆ పాలపుంతలను పసికట్టింది. దీంతో ఈ విశ్వానికి చెందిన కొత్త అట్లాస్‌ను రూపొందించినట్లు ఆ సంస్థ చెప్పింది. సుమారు 30 లక్షల గెలాక్సీలను మ్యాపింగ్ చేసినట్లు సీఎస్ఐఆర్వో తెలియజేసింది. కేవలం 300 గంటల్లోనే నక్షత్రాల మ్యాపింగ్ ప్రక్రియ జరిగినట్లు సీఎస్ఐఆర్వో తెలియజేసింది. తాజా రిపోర్ట్‌ను ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రచురించారు.