Event-Date 01-06-2020
State International
Topic Foreign Relations
కొత్త మ్యాప్‌పై నేపాల్ పార్లమెంటులో బిల్లు
Nepal Introduces New Map Bill In Parliament

భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. భారత దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్ కు  సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మే 31న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్ విడుదల చేసింది. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఇది రెండవ రాజ్యాంగ సవరణ

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.