Event-Date 02-06-2020
State Andhra Pradesh
Topic Persons In News
ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్
vanimohan ppointed secretary election commission

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి జీ.వాణీమోహన్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకారశాఖ కమిషనర్‌గా ఉన్నారు. గతంలో ఆమె జమ్మూ కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు పరిశీలకులుగా విధులు నిర్వర్తించారు.ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డైరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.