Event-Date 02-06-2020
State International
Topic Science And Technology
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
SpaceX makes history with successful first human space launch

ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. మానవ చరిత్రలో నాసా వ్యోమగాములు ఓ కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం ఇదే తొలిసారని  వివరించింది. మొదటిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ వ్యోమగాములు రోదశిలోకి పంపించింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయల్దేరింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్ నేరుగా వీక్షించారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌తో ట్రంప్ ముచ్చటించారు.  తాజా ప్రయోగంలో భారత ఇంజనీర్ బాల రామమూర్తి కీలక పాత్ర పోషించారు. స్పేస్ క్రూ ఆపరేషన్స్ అండ్ రీసోర్సెస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆయన ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్ కంట్రోల్ సెంటర్ ఫైరింగ్ రూమ్ 4లో విధులు నిర్వర్తించారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.