Event-Date 15-09-2019
State National
Topic Persons In News
ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన రాజస్థాన్ బాలిక
A Rajasthan girl who swam the English Channel

బ్రిటన్‌లోని దక్షిణ ఇంగ్లండ్ నుంచి ఉత్తర ఫ్రాన్స్ వరకు ఉన్న ఇంగ్లిష్ చానెల్‌ను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ బాలిక గౌర్వి సింఘ్వీ(16) సెప్టెంబర్ 11న విజయవంతంగా ఈదింది.

  • 40 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను 13 గంటల 26 నిమిషాల్లోనే గౌర్వి ఈదగలిగింది.
  • ఈ క్రమంలో అత్యంత పిన్నవయస్సులో ఈ ఘనత సాధించిన భారతీయ బాలికగా రికార్డు నెలకొల్పింది.
  • గతంలో ఆమె ముంబై తీరంలోని జుహు నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల 22 నిమిషాల్లో ఈదింది.
  • ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన అతిపిన్న వయస్సు బాలిక థామస్ గ్రెగరీ. బ్రిటన్‌కు చెందిన ఈ బాలిక 1988లో తన 11 ఏళ్ల వయస్సులో ఇంగ్లిష్ చానెల్‌ను ఈదింది.
  • ఆ తర్వాత ఈ చానెల్‌ను ఈదడానికి కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.