Event-Date 22-09-2019
State National
Topic Awards And Honours
జాతీయ ఐక్యతా అవార్డు ఏర్పాటు
Sardar Patel National Unity Award

పద్మ అవార్డుల మాదిరిగా సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • ఈ మేరకు అవార్డుకు సంబంధించిన విధి విధానాలను కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 20న వెల్లడించింది.
  • భారత తొలి హోంమంత్రిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన అనుపమాన సేవలకు గుర్తుగా ఆయన పేరిట అవార్డు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2018, డిసెంబర్ 23న ప్రకటించిన విషయం తెలిసిందే.

అవార్డు విధి విధానాలు

 

  • దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో పతకాన్ని రూపొందిస్తారు.
  • అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డును మరణానంతరం ప్రకటిస్తారు.
  • హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎంపిక చేస్తుంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.