Event-Date 22-09-2019
State National
Topic Places In News
గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
National Police University to be setup in Greater Noida

ప్రపంచ స్థాయిలో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

  • ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా-ఎన్‌సీఆర్‌లోని ఐటీ పార్క్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సెప్టెంబర్ 19న తెలిపింది.
  • పోలీస్ వర్సిటీ కోసం గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.371 కోట్లకు 90 ఏళ్లు స్థలాన్ని లీజుకు ఇచ్చిందని చెప్పింది.
  • వర్సిటీ ద్వారా పోలీస్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ ఫోరెన్సిక్, క్రిమినల్ జస్టిస్, క్రిమినాలజి, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో విద్య, శిక్షణ అందిస్తామని పేర్కొంది.
  • డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు ఉంటాయని వివరించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.