పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు.
- ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. దీంతో తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ నిలిచారు.
- బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి సెప్టెంబర్ 19న దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో ఆయన చక్కర్లు కొట్టారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు.
- ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది’ అని అన్నారు.
- ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.